- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీలోని యాకుత్‌పురాలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూత లేని మ్యాన్‌హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైంది. తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా మౌలా కా చిల్లా ప్రాంతంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో బాలిక పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లి, స్థానికుల సహాయంతో బాలికను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో సహాయం అందడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. జిహెచ్ఎంసి సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
Also Read : గొంతు ద్వారా గుండె కవాట మార్పిడి
- Advertisement -