Friday, May 3, 2024

తారాస్థాయికి చేరుకున్న ఎంఐఎం ప్రచారం

- Advertisement -
- Advertisement -

కార్వాన్.. నాంపల్లి, మలక్‌పేట్‌పై ప్రత్యేక దృష్టి

మన తెలంగాణ / హైదరాబాద్: పోలింగ్‌కు మరో నాలుగు రోజులే ఉంది. దీంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. క్షణం తీరిక లేకుండా ఓవైసీ బ్రదర్స్ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు. మోదటి నుండి పాదయాత్రలు, ఇంటింటి ప్రచారానికి ప్రాముఖ్యత నిచ్చే మజ్లిస్ నేతలు వాటిని కొనసాగిస్తూనే కార్నర్స్ మీటింగ్స్, బహిరంగ సభలు చేపడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు తొమ్మిది నియోజకవర్గాలను కలియతిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంఐఎం గట్టిపోటీ ఎదుర్కొంటున్న నాంపల్లి, యాఖుత్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంబిటి అభ్యర్థి నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్న యాఖుత్ పురా నియోజకవర్గంలో అక్బరుద్దీన్ ఓవైసి శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షో బలప్రదర్శనగా జరిగిందని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసి నాంపల్లి, జూబ్లీహిల్స్,. మలక్‌పేటలలో విస్తృతంగా పర్యటిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలతని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్, బిజెపిలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో ఎంఐఎం అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తున్నారు. ఘర్ ఘర్ మజ్లిస్… హర్ ఘర్ మజ్లిస్ నినాదంతో ఎంఐఎంవ క్యాడర్ ప్రచారం నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News