నాటింగ్‌హామ్: ఇంగ్లండ్. సౌతాఫ్రికా (Eng VS SA) మధ్య మూడు టి-20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జరిగి రెండో టి-20ల్ ఇంగ్లండ్, భారీ తేడతో నెగ్గింది. అయితే ఆదివారం నాటింగ్‌హామ్ వేదికగా సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి-20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దైంది. దీంతో సిరీస్ 1-1గా సమంగా ముగిసింది.
కనీసం టాస్ కూడా వేయకుండా ఈ మ్యాచ్ రద్దైంది. తొలి మ్యాచ్‌కి కూడా వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితు డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం దక్షిణాఫ్రికా (Eng VS SA) 14 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టి-20లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 304 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సులతో 141 పరుగులు చేయగా.. అతనికి జోస్ బట్లర్ మంచి సహకారం అందించాడు. బట్లర్ 30 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 16.1 ఓవర్లలో 158 పరుగులుకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 146 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇఫ్పుడు మూడో మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్‌ని సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Also Read : భారత్‌కు రెండు స్వర్ణాలు