Wednesday, September 17, 2025

భారతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన ఆసీస్ యువ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆస్ట్రేలియా-ఎ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. భారత్-ఏ జట్టుతో ఆసీస్ అనాధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. లక్నో‌లో ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కాన్‌స్టాస్(Sam Konstas) చెలరేగిపోయాడు. 114 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు. శామ్‌తో పాటు మరో ఓపెనర్ క్యాంపె‌బెల్‌ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 97 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సుల సాయంతో 88 పరుగులు చేసి సెంచరీకి చేరువలోకి వచ్చాడు.

అయితే శామ్ కాన్‌స్టాస్ (Sam Konstas) హర్ష్‌ దూబే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. క్యాంపె‌బెల్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో తనుష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని(1)ను హర్ష్ దూబే, అలివర్ ఫీకె(2)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశారు. ప్రస్తుతం 69 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఎ జట్టు 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. కూపర్ కోనోల్లీ(68), లైమ్ స్కాట్(43)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News