Sunday, December 15, 2024

ఆదుకున్న ధ్రువ్.. ఆసీస్ ఎ లక్ష్యం 168

- Advertisement -
- Advertisement -

మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ఎ, ఇండియా ఎ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ లో ఇండియా ఎ రెండో ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. మరోసారి ద్రువ్‌ జురెల్‌(68) అర్థశతకంతో జట్టును ఆదుకున్నాడు.

44/4తో జట్టు కష్టాలో పడిన దశలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్.. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతనితోపాటు నితీశ్‌ రెడ్డి(38), తనుశ్‌ కొటైన్‌(44), ప్రసిద్ధ్ కృష్ణ(29) రాణించారు. దీంతో ఆసీస్‌ ఎకు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ ఎ బౌలర్లలో కోరి 4, వెబ్‌స్టర్‌ 3 వికెట్లు, మెక్‌ ఆండ్రూ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఎ 161 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఆసీస్ ఎ 223 పరుగులకు ఆలైౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News