Friday, April 19, 2024

హరితహారం చెట్లను నరికిన వ్యక్తికి ఆరు లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హరిత తెలంగాణే లక్ష్యంగా, అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకాన్నీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మొక్కలను పెంచాలని, చెట్లను నరికివేస్తే భారీ జరిమానాలు విదిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికి కొందరు వ్యక్తులు అధికారుల సూచనలు పాటించకుండా చెట్లను నరికివేస్తున్నారు. ఇదే క్రమంలో సూర్యాపేట జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికిన వ్యక్తికి పంచాయితీ అధికారులు భారీ జరిమానా విధించారు.

సూర్యాపేట, ఖమ్మం రహదారి వెంట ఎస్ ఆర్ ఎస్ పి కాలువ పక్కనే దాదాపు 150 చెట్లు ఉన్నాయి. అయితే చివ్వెల మండలం సూర్యనాయక్ తండాకు చెందిన భూక్యా బాపు ఆ చెట్లను నరికేశాడు. మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంచాయితీ అధికారులు భూక్యా బాపుకు ఆరు లక్షల 64 వేల రూపాయలను జరిమానా విధించారు. ఒక్కో చెట్టుకు 5 వేల చొప్పున జరిమానా విధించినట్టుగా అధికారులు తెలిపారు. వారంలోపు జరిమానా చెల్లించాలని లేనిచో కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News