Friday, March 29, 2024

హయత్‌నగర్‌లో ఘనంగా చెరువుల పండగ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం హయత్‌నగర్ డివిజన్‌లోని బాతుల చెరువులో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా ముందుగా గంగా హరతితో నిర్వహించి అనంతరం డప్పులు, బోనాలు, బతుకమ్మలు, సాంస్కృతిక కార్యక్రమాలతో చెరువు చుట్టురా పండుగ వాతవరణం నెలకొంది. హయత్‌నగర్ మత్సకారుల సంఘం ఆధ్వర్యంలో చేపల వలలతో ఉరేగింపుగా ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా చెరువులకు పూర్వవైభవం వచ్చిందని అన్నారు.

కాళేశ్వరంతో చెరువులను నింపి వ్యవసాయానికి సాగునీరు, మత్స సంపద వృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, చెరువులపై హక్కులు, సబ్సిడీలపై వాహనాలు, 5లక్షల ప్రమాద భీమా, కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ మారుతి దివాకర్, హయత్‌నగర్ మండల తహాశీల్దార్ సంధ్యరాణి, వనస్థలిపురం ఎసిపి పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్తు, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి, డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షుడు చేన్నగోని శ్రీధర్‌గౌడ్, మత్యకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News