Wednesday, December 6, 2023

విపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి/రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో బిఅర్‌ఎస్ పార్టీ అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందు కు సిఎం కెసిఆర్ తీసుక వస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అ న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు దిమ్మతిరిగేలా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందని జోష్యం చెప్పారు. సిఎం కెసిఆర్ త్వ రలోనే అందరికీ మంచి శుభవార్త చెబుతారని, దీంతో రాష్ట్ర ప్రజలకు సంతోషం ప్రతిపక్షాలకు దుఃఖం మిగులుతుందని స్పష్టం చేశారు. శుక్రవా రం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి రెడ్డితో కల సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపిలను దుయ్యబట్టారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  24 గంటల కరెంట్ రావడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసలు కరెంటు ఉందో లేదో ప్లగ్‌లో వేలు పెట్టు చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన ఉచిత కరెంట్ ఉత్త కరెం ట్ అని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనని హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణణాతీతమని, ప్రజలు అవన్నీ మర్చిపోలేదని, మీకు మతిమరుపు ఉంటే ప్రజలకు ఉంటదని అనుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్లడానికి మేము సిద్ధoగా ఉన్నామని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలనే తీర్పుకోరుదామని సూచించారు. కేవలం కరెంటు విషయంలోనే ఎన్నికలకు పోదామన్నా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ 30, 40 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు.

ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిన ఘనత సిఎం కెసిఆర్ దేనని వివరించారు. గతంలో ఎమ్మెల్యేలు రావాలంటే ముందు నీళ్ళ ట్యాంకర్ వచ్చి నీటి సమస్య తీర్చేవని, రూ. 2 వేల పింఛన్లు ఇస్తున్నది సిఎం కెసిఆర్ కాదా అంటూ దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది బి అర్ ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కెసిఆర్ ఆని కొనియాడారు. కాంగ్రెస్ వాళ్లు నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కొండంత అండగా కెసిఆర్ నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 లక్షల 74 వేల మంది పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చామని స్పష్టం చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ‘నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడి నుంచి నేడు నేను సర్కారు దవాఖానాకే పోతా బిడ్డో అనే వరకు మన వైద్యరంగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్ధిలోకి తీసుకొచ్చారని అవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కారమవుతున్నాయని వివరించారు.

సిఎం కెసిఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని అభివర్ణించారు. కెసిఆర్ ఏనాడు మాట తప్పలేదని, తెలంగాణ తెస్తా అన్నాడు సాధించి చూపెట్టాడు, కానే కాదు రానేరాదు అన్న తెలంగాణను ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించినాడని గుర్తు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కనీసం హైదరాబాద్‌లో ఇల్లు కూడా లేదని, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిబిరిటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యుడు పైళ్ళ శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫేడ్ కా ర్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News