Friday, May 3, 2024

‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను: నాని

- Advertisement -
హైదరాబాద్: ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశానని, కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ప్రామెసింగ్ గా వుందని, తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేచురల్ స్టార్ నాని తెలిపారు.  అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ ఆ ఒక్కటీ అడక్కు హిలేరియస్ ట్రైలర్‌ ను  నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.
కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతుంది.  మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారని, అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొందని, ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది
హీరో అన్ మేరిడ్ అని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయని, అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్  తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.
ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్,  వైవా హర్షల ప్రజెంస్ తగిన వినోదాన్ని అందిస్తుంది. సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా వుందని, నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా తనని అడగరని, అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్ధమౌతుందని,  ‘ఆ ఒక్కటీ అడక్కు’.. నరేష్ నాన్న డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ వుందని అనుకుంటున్నానని వివరణ ఇచ్చారు. నరేష్ అద్భుతమైన నటుడు అని, తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని తానే కోరానని నాని చెప్పారు. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్ లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించిందని, ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా వుందని, అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుందని, ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. మే 3న నరేష్ తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నానని, ‘ఆ ఒక్కటీ అడక్కు’తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానని, ఫారియా అందమైన చిరునవ్వు గల నటి అని, దర్శకుడు మల్లి గారికి ఆల్ ది బెస్ట్, చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నారని ప్రశంసించారు. కంటెంట్ ప్రామెసింగ్ అండ్ ఫ్రెష్ గా వుందని, ఇవివి ఆశీర్వాదం కూడా టీం అందరికీ వుంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాననని చెప్పుకొచ్చారు.

ఆ ఒక్కటీ అడక్కు’తో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రేక్షకులని నవ్వించడంతో పాటు మంచి కంటెంట్ ఇస్తుందని హీరో అల్లరి నరేష్ తెలిపారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాని మా ఫ్యామిలీ మెంబర్ లానే వుంటారని, తను ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుందని, ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీం ఎఫర్ట్ తో పాటు రవి మాటలు మల్లి గారి డైరెక్షన్, సూర్య కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్, అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది అని మెచ్చుకున్నారు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నానని, ఖచ్చితంగా  ఈ సమ్మర్ లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తారని, ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తానని, తప్పకుండా ఈ సినిమా మే 3న చూడాలని నరేష్ కోరారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్ అని, ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది అని, మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారని, సిద్ది అని పిలిచినా బావుటుందని, ( నవ్వుతూ) నిర్మాత రాజీవ్, దర్శకుడు మల్లి, టీం అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఇష్టపడే సినిమా ఇది అని, తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని, నాని సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తిని ఇచ్చిందని ప్రశంసించారు.

నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. నాని గారికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారని, తొలి సినిమా నిర్మాతలమైన మాతో సినిమా చేసినందుకు అల్లరి నరేష్ ధన్యవాదాలు తెలిపారు. నరేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభవం వచ్చింది, ఫారియాకు మిగతా చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా సందడిగా గోలగా గా ఉంటుంది. వినోదంతో పాటు చివర్లో అందరికీ ఉపయోగపడే మాట వుంటుంది. అందరికోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకుడు- మల్లి అంకం
నిర్మాత – రాజీవ్ చిలక
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
బ్యానర్ – చిలక ప్రొడక్షన్స్
విడుదల – ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP
రచయిత – అబ్బూరి రవి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ  – సూర్య
సంగీతం  – గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ – శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ – వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో – వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ – అనిల్ భాను

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News