Tuesday, January 31, 2023

రాహుల్ గాంధీతో కలిసి నడిచిన ఆదిత్య థాక్రే

- Advertisement -

హింగోలీ: నాందేడ్ జిల్లా పొరుగున ఉన్న హింగోలీలోని కలంనూరిలో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’లో శివసేన నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రే పాల్గొన్నారు. ఆదిత్య థాక్రే వెంట ఆయన సహచరులు అంబాదాస్ దాన్వే, సచిన్ ఆహిర్ తదితరులు కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర నేడు 65వ రోజుకు చేరుకుంది. వారు రోడ్డుకిరుపక్కల బారులు తీరిన ప్రజలకు చేతులూపుతూ ముందుకు కదిలిపోయారు. నాందేడ్‌లోని అర్ధపుర్ తాలూకాకు చెందిన సేనీ గ్రామంలో ఆ యాత్రలో పాల్గొనవారిపై పూలూ విరజల్లారు. పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు కూడా పాల్గొన్నారు. వారి వెంట ఓ ఏనుగును కూడా తెచ్చారు. రోడ్డు ప్రక్కన ఉన్న వారిలో కొందరు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ అని కూడా నినదించారు. వారిలో 22 మంది మాజీ జవానులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో శివసేన(యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రేను ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles