రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. గురువారం (ఆగస్టు 14)న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర వంటి దిగ్గజ నటులు ప్రేక్షకులను అలరించారు. అయితే కూలీలో దాహా అనే అతిథి పాత్రలో నటించి అమీర్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. అమీర్ ఏకంగా రూ.20 కోట్లు ఈ చిత్రంలో నటించేందుకు తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలకు అమీర్ (Aamir Khan) చెక్ పెట్టారు. తను ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘రజనీకాంత్‌పై నాకు ఉన్న ప్రేమ అభిమానానికి వెలకట్టలేరు. ఆయనతో కలిసి తెరపై కనిపించడమే పెద్ద రివార్డు. ఇందులో నేను అతిథి పాత్రలో మాత్రమే కనిపించాను. రజనీ, నాగార్జునలే అసలైన హీరోలు. ‘కూలీ’ చూసేందుకు ప్రేక్షకులు ఇంతలా ఆసక్తి చూపిస్తున్నారంటే అందుకు కారణం వాళ్లే. నా కోసం కాదు’’ అని అమీర్ తెలిపారు.