Tuesday, April 30, 2024

ఖర్గేతో ఆప్ నేత సంజయ్ సింగ్ భేటీ.. కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకుని కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అజెండాలో ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తనకు ఖర్గే మద్దతుగా ఉండాలని కోరారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఖర్గేను సంజయ్ సింగ్ కలుసుకోవడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ విధంగా జైలులో ఆయనను చూస్తున్నారో ఆయన ప్రాథమిక హక్కులను ఎలా కాజేశారో ఖర్గేకు వివరించారు. రాజ్యసభలో విపక్ష నాయకుడిగా ఖర్గే తమకు ఏ విధంగా మద్దతు అందిస్తున్నారో తెలియజేశారు. అందుకనే జైలు నుంచి విడుదలైన తరువాత ఖర్గేను కలుసుకోడానికి వచ్చినట్టు సంజయ్ సింగ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో చర్చించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News