Friday, July 18, 2025

అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష కోరారు చేసిన న్యాయస్థానం. 2019లో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లో ఉంటున్న రంజింత్ సింగ్ అనే యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అప్పుడున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో నిందితుడికి గురువారం శిక్ష కోరారు చేసింది రాజేంద్రనగర్ కోర్టు.

నిందితుడు రంజిత్ సింగ్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష తోపాటు 8 వేల రూపాయిల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది రాజేంద్రనగర్ కోర్టు. సింగ్ బిహార్ రాష్ట్రానికి చెందిన రంజిత్ సింగ్ గగన్ పహాడ్ లో ఉంటూ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. నింధితుడు రంజిత్ సింగ్ కు శిక్ష విధించడంతో పాటు బాదితురాలికి 3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కోంది. అయితే కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా ఆధారాలను సేకరించడంలో మెరుగైన సహయ సహకారాలు అందించిన ఎసిపి అశోక్ కుమార్, సిఐ బాల్ రాజ్, కానిస్టేబుల్ శివకుమార్, హోంగార్డు ప్రశాంత్, వెంకటేష్ లను ఉన్నతాధికారులు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News