మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్.(Phoenix) ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్‌తో వుండబోతుంది. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి అనల్ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీ రో సూర్య సేతుపతి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌ని ముందే ప్రాక్టీస్ చేయించారు.
ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్ ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు. డైరెక్టర్ అనల్ అరసు మాట్లాడుతూ “ఫైట్ మాస్టర్‌గా (fight master) పెద్ద పెద్ద సినిమాలు చేశాను. అయితే యాక్షన్ లో కూడా ఒక కొత్తదనం ఉండాలని ప్రయత్నంతో ఈ ఫినిక్స్ సినిమా చేయడం జరిగింది. సూర్యని ఎందుకు తీసుకున్నానో సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వర్ష, భాష్య శ్రీ, ధనంజయన్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.