ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపిఎల్ నుంచి తప్పుకుంటూనే బాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్‌లో ధోనీ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదన్నాడు. గతంలో ధోనీ ఐపిఎల్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన విషయం తనకు గుర్తుందని, అయితే ప్రస్తుతం వయసు పెరగడంతో అతనిలో సత్తా తగ్గిందన్నాడు. ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌లో కొనసాగడం కంటే రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో చెన్నై ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్నాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా జట్టుకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదన్నాడు. మునుపటిలా అతను జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడన్నాడు. ఇక కాన్వే, దీపక్ హుడా, షేక్ రశీద్ తదితరులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయారన్నాడు. వీరి వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణమని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
ధోనీ ఐపిఎల్ నుంచి తప్పుకోవాలి :ఆడమ్ గిల్‌క్రిస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -