Friday, April 19, 2024

అదానీ నికర సంపద మళ్లీ పడిపోయింది!

- Advertisement -
- Advertisement -

ముంబై: గౌతమ్ అదానీ గ్రూప్ స్టాక్స్ నేడు మళ్లీ పతనమయ్యాయి. దాదాపు 1.7 బిలియన్ డాలర్ల ఆయన సంపద ఆవిరి అయింది. ఆయన సంపద గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 25వ స్థానానికి పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక రాకముందు ఆయన సంపద 119 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉండింది. కానీ ఇప్పుడు ఆయన సంపద 45.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

అదానీ గ్రూప్ షేర్లలో అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, ఎన్‌డిటివి, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు లోయర్ సర్కూట్‌ను తాకాయి. కాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్, ఏసిసి, అంబుజా సిమెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లన్ని నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఆయన నికర సంపద విలువ గణనీయంగా పడిపోయింది. పరిస్థితులను మదుపరులు, మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు. నేడు కుబేరుల జాబితాలో టాప్ లూజర్‌గా అదానీయే ఉన్నారు. నేడు ఆయన 1.7 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అంటే ఆయన సంపదలో 3.66 శాతం కోల్పోయారు. ఇప్పుడు ఆయన సంపద నికర విలువ 45.6 బిలియన్ అమెరికా డాలర్లు. ఇదిలావుండగా భారత అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News