Thursday, May 2, 2024

బిజెపిలో చేరకపోతే అరెస్టంట : ఆతిషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘బిజెపిలోనైనా చేరండి లేకపోతే నెలలోపల ఈడి అరెస్టుకైనా సిద్ధంగా ఉండండి’ అని తనకు చాలా దగ్గరి వ్యక్తి అన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మంగళవారం తెలిపారు. తనతో పాటు మరి ముగ్గురు ఆప్ నాయకులు  సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ ఛధ కూడా అరెస్టవుతారని ఆ వ్యక్తి తెలిపినట్లు ఆమె తెలిపింది. తన ఇంట్లోనూ, తన బంధువుల ఇంట్లోనూ ఈడి దాడులు కూడా జరగొచ్చని ఆ వ్యక్తి తెలిపినట్లు వివరించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను జైలుకు పంపడంతో ఆప్ విచ్ఛినం కాబోదని కూడా ఆతిషి తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మనీ లాండరింగ్ కేసు, లిక్కర్ కేసులో మార్చి 21న ఈడి అరెస్టు చేసింది.

బిజెపి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటోందని, పార్టీని దెబ్బతీసి శాసనసభ్యులను లాక్కోడానికి ఎరవేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఆప్ కు చెందిన కిరారి ఎంఎల్ఏ రితు రాజ్ ఝాకు కాషాయం పార్టీలో చేరేందుకు రూ. 25 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News