Thursday, May 2, 2024

పంట నష్టంపై నివేదికలు సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగి పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు నివేదికలు సిద్ధ్దం చేశాయి. జిల్లాల నుంచి అందిన నివేదికలను విశ్లేసించి రాష్ట్ర స్థా యిలో పంట నష్టం నివేదికను రూపొందించాయి. నేడో, రేపో ఈ నివేదికలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో పం ట జరిగినట్టు తేలింది. గత నెల 16 నుం చి ప్రారంభమైన అకాల వర్షాలు , వడగండ్ల వానలకు రాష్ట్రంలో యాసంగి పంటలు దెబ్బతిన్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ,బలమైన గాలుల దెబ్బకు భారీగా పంటనష్టం జరిగింది.

యాసంగిలో వరి, మొక్కజొన్న , జొన్న, శనగ, మినుము , పెసర , కంది తదితర ప్రధాన అహార పంటలతోపాటు వేరుశనగ, పొద్దుతిరుగుడు, ను వ్వులు, కుసుమలు తదితర నూనెగింజ పంటలు సాగయ్యాయి. అన్నిరకాల పంటలు కలిపి 72. 63 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. పలు జిల్లాల్లో వరి కోత దశకు వచ్చింది.మరి కొన్ని జి ల్లాల్లో ఆలస్యంగా వరినాట్లు వేశారు. జిల్లాల్లో వరి కంకి పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే ద శకు చేరాయి. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు వడగండ్ల వానలు కురియడంతో కోత దశలో ఉన్న వరి పైరు గింజలన్ని నేలరాలాయి. గాలి వాన ధా టికి పైరు నేల వాలిపోయింది. పొలంలో నీరు నిలవటంతో వరికంకులు నిలువ నీటిలో నాని గింజ నాణ్యత దెబ్బతింది. మొక్కజొన్న పంటలు కూడా భారీ వర్షాలకు దెబ్బతింది. గింజ నాణ్యత చెడిపోయింది. జిల్లాల నుంచి అందిన పంట నష్టా ల నివేదికల ప్రకారం తరువాయి 10లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News