Friday, July 18, 2025

దేశంలో క్లీన్ సిటీ అహ్మదాబాద్

- Advertisement -
- Advertisement -

దేశంలోనే మోడీ రాష్ట్రం ప్రధాన నగరం అహ్మదాబాద్ అత్యుత్తమ స్వచ్ఛ నగరంగా నిలిచింది. స్వచ్ఛతకు కొలమానాల నూతన ర్యాంకింగ్ విధానం స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ (ఎస్‌సిబి) పరిధిలో సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీలలో అహ్మదాబాద్ మొదటి స్థానంలో తరువాతి క్రమంలో భోపాల్, లక్నోలు నిలిచాయి. ఇక ఇండోర్ , సూరత్, నవీ ముంబయిలు కూడా ఈ జాబితా వరుసలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛత అధ్యయనం దశలో రూపొందిన జాబితాలో విజయవాడ కూడా చోటు దక్కించుకుంది. నూతనంగా సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటిస్ కేటగిరి ఖరారు అయింది. పారిశుద్ధంలో అసాధారణ ఫలితాలు కనబర్చిన నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా గురువారం వెలువరించింది.4500కు పైగా పట్టణాలు నగరాలలోని 14 కోట్ల మందిని ముఖాముఖీ పలకరించిన క్రమంలో ఈ సర్వే ఫలితాలు అందుబాటులోకి తెచ్చారు

. ఇందుకు స్వచ్ఛత ఆప్, మైగవ్ పలు సామాజిక మాధ్యమాలు తమ కీలక పాత్ర నిర్వర్తించాయి. పలు విషయాలను పరిశీలించేందుకు ప్రత్యేక నాలుగు కేటగిరీలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 78 అవార్డులను స్వచ్ఛత పరిరక్షణ దిశలో బహుకరించారు. జనాభా , విస్తీర్ణం వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని సూపర్ స్వచ్ఛ్ లీగ్‌కు ఎంపికలు జరిగాయి. ఇక మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాలలో క్లీన్ అవార్డు పొందిన నగరాల్లో నోయిడా తొలిస్థానంలో నిలిచింది. తరువాత చండీగఢ్ , మైసూరులు తమ స్థానాలు పొందాయని అధికార ప్రకటనలో తెలిపారు. కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ ఇతరులు హాజరయిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అవార్డులు అందచేశారు. స్వచ్ఛతను పాటించిన నగరాల అధికారులను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News