- Advertisement -
న్యూఢిల్లీ: ఇండోర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసరంగా దిగింది. 30 నిమిషాలపాటు గాల్లోనే ఉండిన తర్వాత పైలట్‌కు విమానం ఇంజిన్‌లో ‘అగ్ని సంకేతం’ అందడంతో అత్యవసరంగా దించేశారని అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి. ఎ320 నియో విమానం ఇంజిన్ ఆపేయడం జరిగిందని, దానిని వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దించేయడం జరిగిందని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో విమానం అత్యవసరంగా దిగింది. ఆ విమానంలో 90 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎఐ2913 విమానాన్ని తనిఖీ కోసం నిలిపేశారు. ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నది గమనార్హం.
- Advertisement -