Thursday, November 7, 2024

మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ఎఐసిసి పరిశీలకుల భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహం పై ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భుపేష్ బఘేల్, చరణ్ జిత్ చన్నీలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.యస్ సింగ్ దేవ్ ,పరమేశ్వరన్ లు సమాలోచనలు చేశారు. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎన్నికల పరిశీలకులు టి.జి.నీటిపారుదల , పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి సీతక్క, యం.బి.పాటిల్ తదితరులు హాజరయ్యారు.

నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గాను కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్నికల ప్రచార వ్యూహానికి ప్రణాళికలు రూపొందించారు. ముందెన్నడూ లేని రీతిలో ఆ పార్టీ సీనియర్లను,అనుభవజ్ఞులైన నేతలను రంగంలోకి దింపింది. మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల అధ్యక్షతన శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశంలో అధికార బిజేపి, షిండే ఆద్వర్యంలోని శివసేన లను ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి దోహదపడే అంశాలపై అబిపార్టీ యంత్రాంగం దృష్టి సారించింది.

ఈ సమావేశంలో ఆ పార్టీకీ చెందిన సీనియర్లు, అపార ఆనుభజ్ఞులు అయిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, భుపేష్ బగేల్ ,చరణ్ జిత్ చన్నీ లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.యస్.సింగ్ దేవ్,పరమేశ్వరన్ లు,ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహారాష్ట్ర లో అధికారంలో ఉన్న శివసేన(షిండే) బిజెపి కూటమి ని ఎదుర్కోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశం కసరత్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News