Sunday, July 13, 2025

అజయ్ దేవ్‌గన్ భోలాగా కార్తీ ఖైదీ (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కార్తీ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం మంచి విజయం అందుకున్న ఖైదీ చిత్రం ఇప్పుడు హిందీలో భోలాగా నిర్మాణం జరుపుకుంటోంది. అజయ్ దేవ్‌గన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న భోలా చిత్రం మోషన్ పోస్టర్ మంగళవారం విడుదలైంది. 2023 మార్చి 30న చిత్రం విడుదల తేదీని కూడా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నుదుట విభూతి ధరించి అజయ్ దేవ్‌గన్ కొత్త లుక్స్‌లో కనిపించాడు. ఖైదీని నిర్మించిన డ్రీమ్ వరియర్స్ పిక్చర్స్ హిందీ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఖైదీలో కార్తీతోపాటు నరేన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, జార్జి మరియన్, ధీనా నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News