Saturday, December 14, 2024

మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ మ్యానిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అజిత్‌పవార్ సారథ్యం లోని ఎన్సీపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. బారామతిలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కొత్త మహారాష్ట్ర విజన్‌ను అందజేస్తామని అజిత్ పవార్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వ్యవసాయ సదుపాయాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సునీల్ తట్కరే ముంబైలో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ గోండియాలో మ్యానిఫెస్టోను విడివిడిగా ఆవిష్కరించారు.

మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
1. గ్రామీణ ప్రాంతాల్లో 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన 2. లడ్కీ బహిన్ పథకం నెలవారీ సాయం రూ.1500, నుంచి 2100 కు పెంపు, 3. వరి రైతులకు హెక్టారుకు రూ.25 వేల బోనస్, 4.వృద్ధాప్య పింఛను రూ1500 నుంచి రూ. 2100 కు పెంపు, 5.షెట్కారీ సన్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 15,000 , 6. గ్రామీణ ప్రాంతాల్లో 45,000 “ పనంద్ ” రోడ్ల నిర్మాణం 7. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు రూ. 15,000 నెలవారీ జీతం, 8. సౌర , పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యత, విద్యుత్తు బిల్లుల్లో 30 శాతం తగ్గింపు తదితర మైనవి. 288 శాసన సభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News