Wednesday, September 18, 2024

లండన్ ఎయిర్‌పోర్టులో బిడ్డ తల్లి బ్యాగు మోసిన అజిత్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ మంచితనానికి మారుపేరుగా మరోసారి రుజువు చేసుకున్నారు. పది నెలల చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న ఒక మహిళకు లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో బ్యాగు మోసి చేయూత నందించారు. అజిత్ మానవతాకోణాన్ని కీర్తిస్తూ ఆ మహిళ భర్త కార్తీక్ తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఒక ట్వీట్ నెటిజన్ల నుంచి ప్రశంసలందుకుంటోంది.

తన భార్య గ్లాస్గో నుంచి చెన్నైకు ప్రయాణిస్తోందని, 10 నెలల బిడ్డతో కలసి ఆమె ఒంటరిగా వస్తోందని కార్తీక్ తెలిపారు. లండన్ హీత్రో విమానాశ్రయంలో తమిళ సూపర్‌స్టార్ అజిత్‌ను కలిసే అవకాశం తన భార్యకు కలిగిందని ఆయన చెప్పారు. తన భార్య చేతిలో క్యాబిన్ సూట్‌కేసు, ఒక బేబీబీ బ్యాగు ఉన్నాయని, తన భార్యతో కలసి ఫోటో తీసుకోవడమేగాక ఆమె చేతిలోని బేబీ బ్యాగును అజిత్ తీసుకున్నారని, ఆమె వారిస్తున్నా వినకుండా ఆయన విమానం ఎక్కేవరకు ఆ బ్యాగును మోశారని కార్తీక్ తెలిపారు.

Also Read: మెట్రోలో డ్రీమ్‌గర్ల్…. ఆటోలో ఇంటికి (వైరల్ వీడియో)

మీకెందుకు సార్ శ్రమ అని తన భార్య చెబితే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ కష్టం ఏమిటో నాకు తెలుసు అంటూ అజిత్ బదులిచ్చారని కార్తీక్ తెలిపారు. విమానం ఎక్కిన తర్వాత క్యాబిన్ సిబ్బందికి తన చేతిలోని బ్యాగు ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఆమె సీటు వద్ద ఉంచాలని అజిత్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. అజిత్ వెంట ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తలైవా..మీరు ఎందుకు.నేను తీసుకు వస్తాను అని చెప్పినప్పటికీ అజిత్ వినలేదని కార్తీక్ వివరించారు. ఒక సూపర్‌స్టార్ ఇంత నిరాడంబరంగా ఉండడం, తోటి ప్రయాణికురాలికి సాయం అందించడం చాలా గొప్ప విషయమని, అజిత్ వ్యక్తిత్వానికి తాను ముగ్ధుడనై పోయానని ఆయన రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News