Thursday, November 7, 2024

నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ మూవీ షురూ..

- Advertisement -
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు మేకర్స్. ఇదివరకే అఖండ 2 తెరకెక్కిస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ తోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, బాలకృష్ణపై ముహూర్తపు షాట్‌కు నారా బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, మాస్ డైరెక్టర్ బోయపాటి రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘అఖండ 2 – తాండవం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News