అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ఆల్కహాల్’ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ’ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని ఈ టీజర్ సూచిస్తుంది. హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, ’ఆల్కహాల్’ రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. సుహాస్ నటించిన ‘ఫ్యామిలీ డ్రామా’తో విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
థ్రిల్లర్ డ్రామాగా అల్లరి నరేష్ ’ఆల్కహాల్’.. టీజర్ వచ్చేసింది
- Advertisement -
- Advertisement -
- Advertisement -