Saturday, April 27, 2024

జనవరి 14న ‘నా సామిరంగ’

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని చేస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ఆదివారం మేకర్స్ ప్రకటించారు. సినిమా టైటిల్ సాంగ్- నా సామి రంగ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ పాట మైమరిపిస్తోంది.

‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ..’ అనే పదాలు కథానాయకుడి పాత్రని తెలియజేస్తూ మాస్‌ని ఆకట్టుకునేలా వున్నాయి. ఈ పాటని కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో ఆలపించారు. ప్రధాన తారాగణంతో పాటు 300 మంది డ్యాన్సర్స్‌తో లావిష్‌గా చిత్రీకరించిన పాటకు దినేష్ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫర్ అద్భుతంగా వుంది. నాగార్జున తన మాస్ స్వాగ్‌తో కట్టిపడేశారు. నాగార్జున, అల్లరి నరేష్ లుంగీలో మాస్ అవతారాల్లో ఆకట్టుకుంటే, రాజ్ తరుణ్ ఫార్మల్స్‌లో కనిపించారు.

నాగార్జునతో కలిసి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్ ,యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని మ్రేకర్స్ అంటున్నారు. నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News