Wednesday, May 8, 2024

మోడీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు.. ఓట్లేందుకు వేయాలి?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని పాయకరావుపేటలో షర్మిల ఎన్నికల ప్రచారంలో అన్నారు. పదేళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా?.. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా?.. అధికారంలోకి వచ్చాకా జగన్ ప్రత్యేక హోదా కోసం జగన్ ఒక్క ఉద్యమమైన చేశారా?.. పదేళ్లలో రాజధాని కట్టగలిగారా?.. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లేందుకు వేయాలి? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెగా డీఎస్పీ అని దగా డీఎస్పీ ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడే గుర్తొచ్చిందా? అన్నారు. కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడు. వీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయల్దేరారు.. దేనికి అప్పులు చేయడానికా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగన్నారు. ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని షర్మిల అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News