Thursday, May 9, 2024

9 ముఖ్య హామీలతో  వైసిపి మేనిఫెస్టో-2024 విడుదల!

- Advertisement -
- Advertisement -

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ. 75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు, రైతు భరోసా రూ. 13500 నుంచి 16000కు పెంచుతామన్నారు.  వైఎస్సార్ ఈబిసి నేస్తం నాలుగు దఫాల్లో 45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచుతామన్నారు.

ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ, రెండు విడతల్లో పింఛను రూ. 3000 నుంచి రూ. 3500కు పెంచడం, 2028లో జనవరిలో మరో రూ. 250 పింఛను పెంచడం,లారీ , ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, యూనివర్శిటీల్లో బ్యాక్ లాగ్ లో ఉన్న 3590 పోస్టుల భర్తీ, మత్స్యకారుల భరోసాను ఐదేళ్లలో రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచుతామన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ హబ్,అమ్మ ఒడి రూ. 15 వేల నుంచి రూ. 17 వేలకు పెంచనున్నారు, వాహన మిత్రను ఐదేళ్లలో 50 వేల నుంచి లక్షకు పెంచుతారు, ఐదేళ్లలో ఓబిసి నేస్తం అమలుచేస్తామన్నారు.

‘చేయగలిగినవి మాత్రమే చెబుతున్నాం’ అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మేనిఫోస్టో ప్రతి ప్రభుత్వ అధికారి వద్ద ఉందన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అని అభిప్రాయపడ్డారు. 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. తమ మేనిఫెస్టో అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచపోతుందన్నారు. రూ. 2 లక్షల 70 వేల కోట్లను డిబిటి చేశామని తెలిపారు. నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు వేశామన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఏపి సిఎం జగన్ 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల మేనఫెస్టోలో 9 హామీలు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత(సోషల్ సెక్యూరిటీ) అనేవి ఇందులో ఉన్నాయి.

YCP manifesto

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News