Wednesday, May 8, 2024

లైంగిక వేధింపులు: అర్జున అవార్డు గ్రహీత CRPF అధికారికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(DIG) ర్యాంక్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజన్ సింగ్ ను సర్వీస్ నుంచి తొలగించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్(సిఆర్పీఎఫ్) చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఖాజన్ కు నోటీసులు జారీ చేసింది.

తన పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఖాజన్ సింగ్‌పై ఫోర్స్‌కు చెందిన పలువురు మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాజన్ పై విచారణ జరిపిన ఫోర్స్.. ఆరోపణలు నిజమేనని నిర్ధారించిందని అధికార వర్గాలు తెలిపాయి.

సిఆర్‌పిఎఫ్ అధికారి ప్రవర్తనపై విచారణ నిర్వహించి, చట్టపరమైన విధానాలను అనుసరించి, యుపిఎస్‌సికి నివేదికను సమర్పించింది. దీంతో సర్వీస్ నుండి అతనిని తొలగించాలని యుపిఎస్‌సి సిఫార్సు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా ఆమోదించడంతో ఖాజన్ కు సిఆర్‌పిఎఫ్ తొలగింపు నోటీసును జారీ చేసింది. దీనిపై వివరణ కోసం ఖాజన్ కు సమయం ఇచ్చారని.. స్పందించకపోతే తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News