Wednesday, May 8, 2024

భస్మీపటలం చేస్తున్న నైనితాల్ కార్చిచ్చు

- Advertisement -
- Advertisement -

నైనితాల్: ఉత్తరాఖండ్ లోని నైనితాల్ లో కార్చిచ్చు చెలరేగింది. మంటలను ఆర్పడానికి భారత వాయుసేన, సైన్యాన్ని రంగంలోకి దించారు. 36 గంటలపాటు కొనసాగుతున్న ఈ అటవీ కార్చిచ్చు అనేక హెక్టార్ల పచ్చదనాన్ని బూడిద చేసేసింది. జిల్లా అధికారులు మంటలార్పడానికి హెలికాప్టర్లు కావాలని కోరుతున్నారు.

హల్ద్వాని జిల్లాలో నైనితాల్ కార్చిచ్చుపై  చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అటవీ కార్చిచ్చు నైనితాల్ లోని హైకోర్టు కాలనీకి కూడా ముప్పుగా మారింది. మంటలు ఆర్పేయాలని ముఖ్యమంత్రి అన్ని సంబంధిత శాఖలను కోరారు. కార్చిచ్చు భారత సేన స్థావరాల వరకు అంటే పైన్స్ ఏరియా వరకు ప్రమాద స్థాయిలో విస్తరిస్తోంది. నైనితాల్ అటవీ శాఖ ఇప్పటికే మంటలార్పేందుకు 40 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News