Saturday, April 27, 2024

మనసు ప్రేమించే వరకే బావుంటుంది…

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. బుధవారం మేకర్స్ నా సామిరంగ సినిమా నుంచి రాజ్ తరుణ్ ని భాస్కర్ గా పరిచయం చేస్తూ గ్లింప్స్‌ని విడుదల చేశారు. గ్లింప్స్‌లో భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్ ధిల్లన్)ల 1980 నాటి ప్రేమకథని చాలా అందంగా పరిచయం చేశారు. “మనసు ప్రేమించే వరకే బావుంటుంది. ప్రేమించగానే అలోచించడం మానేస్తుంది.

తనకోసం ఏదైనా చేసేయొచ్చు, ఏమడిగిన ఇచ్చేయవచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినపుడు తన మొహం మీద వచ్చే చిరునవ్వు. అది చూసి మన మనసులో కలిగే ఆనందం. దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారి గోడ ఏంటి? చైనా గోడ దూకిన తప్పు లేదు” అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్, దానికి అనుగుణంగా కాలేజీ నేపధ్యంలో చిత్రీకరించిన విజువల్స్ చాలా అద్భుతంగా వున్నాయి. రాజ్ తరుణ్, రుక్సార్ జోడి చాలా అందంగా కనిపించింది. వారి వింటేజ్ స్టొరీస్ మనసుని హత్తుకుంది. ఈ గ్లింప్స్‌కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇచ్చిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.

మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు. నా సామిరంగ సినిమా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News