Tuesday, May 7, 2024

మొబైల్ ఫోన్ల చోరీ అంతర్జాతీయ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

మొబైల్ ఫోన్లను చోరీ చేసి ఇతర ఇతర దేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషన్ శ్రీనివాస రెడ్డి శుక్రవారం సిసిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్ల చోరీ నిందితుల్లో 12 మంది హైదరాబాద్‌కు చెందినవారు, ఐదుగురు సూడాన్ వాసులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్, తాడ్‌బాన్‌కు చెందిన మహ్మద్‌ః ముజామీల్ అలియాస్ ముజ్జు వివాహం వేదికలను డెకరేషన్ పనిచేస్తున్నాడు. జహనామాకు చెందిన సయిద్ అబ్రార్, సయిద్ సలీం, పతన్ రబ్బాని ఖాన్ అలియాస్ జాఫర్ ఖాన్, మహ్మద్ అత్తర్, మహ్మద్ జకీర్, షేక్ అజహార్ అలియాస్ జాఫర్, మహ్మద్ ఖాజా నిజాముద్దిన్ అలియాస్ ఖైసర్ అలియాస్ అజ్జు భాయ్,

సయిద్ లాయిక్, షేక్ అజహర్ మోయినుద్దిన్, మహ్మద్ షఫీ అలియాస్ బబ్లూ, జె. ఎలమందరెడ్డి, సూడాన్ దేశానికి చెందిన ఖలీద్ అబ్దేల్‌బాగి మహ్మద్ అల్‌బడివి, అబ్దలేహ్ అహ్మద్ ఉస్మాన్ బాబికర్, అయ్‌మన్ మహ్మద్ సలిహ్ అబ్దాల్లా, అనాస్ సిద్దిగి అబ్‌బెల్‌గాదర్ అహ్మద్, ఒమర్ అబ్దుల్లా ఎల్టయాబ్ మహ్మద్ కలిసి మొబైల్ ఫోన్లు చోరీ చేసి విక్రయిస్తున్నారు. ముజామిల్, సయిద్ అబ్రార్ చేస్తూన్న పనిలో వచ్చే డబ్బులు వీరి జల్సాలకు సరిపోవడంలేదు. దీంతో మొబైల్ ఫోన్లు చోరీ చేసి విక్రయించాలని ప్లాన్ వేశారు. మొబైల్ ఫోన్లను కొట్టేసిన తర్వాత నిందితులు వాటిని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు బజాజ్ బైక్‌ను చోరీ చేసి దానిపై రాత్రి సమయంలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు. ఇలా నిందితులు బండ్లగూడ, ఫలక్‌నూమా, బహదుర్‌పుర, మంగళ్‌హాట్, హయత్‌నగర్ పరిధిలో చోరీ చేశారు. జగదీష్ మార్కెట్‌లో షాపు ఉన్న ఎండి షఫీ కొట్టేసిన ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు.

వీరి వద్ద సూడాన్‌కు చెందిన దేశస్థులు ఫోన్లను కొనుగోలు చేసి విదేశాలకు షిప్పుల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. నిందితులు ఐ ఫోన్లు, సామ్‌సంగ్, వివో, రెడ్‌మీ, రియల్ మీ, వన్‌ప్లస్, ఒప్పో, పోకో తదితర బ్రాండ్లకు చెందిన ఫోన్లను కొట్టేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్‌ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్ చేస్తున్నారని వెల్లడించారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీశ్ మార్కెట్‌లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటుచేశాడని పేర్కొన్నారు. ఐఫోన్లను కూడా రూ.8 వేల నుంచి అమ్ముతున్నారని చెప్పారు. సెల్‌ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News