Sunday, May 19, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(మే 7న) సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎఫ్ఎంసిజి తప్పించి అన్ని రంగాల షేర్లు కుప్పకూలాయి. ఇక ఇండియా విక్స్ అయితే 4 శాతం పెరిగి 17కు చేరుకుంది.

సెన్సెక్స్ 369.76 లేక 0.50 శాతం పతనమై 73525.78 వద్ద, నిఫ్టీ 141.25 పాయంట్లు లేక 0.63 శాతం పతనమై 22301.45 వద్ద ముగిసింది. నిఫ్టీ టాప్ గెయినర్లలో హెచ్ యూఎల్, టెక్ మహీంద్ర, నెస్లే ఇండియా, బ్రిటానియా ఉండగా, టాప్ లూజర్లుగా బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఓఎన్జీసి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.

నేడు ఎంసిఎక్స్ లో 10 గ్రాముల బంగారం రూ. 261 లేక 0.36 శాతం తగ్గి రూ. 71111.00 వద్ద ట్రేడయింది. కాగా డాలరుకు రూపాయి మారకం విలువ 0.01 (0.01 శాతం) పెరిగి రూ. 83.51 వద్ద ట్రేడయింది. స్టాక్ మార్కెట్ గత 3 రోజుల్లో రూ. 11 లక్షల కోట్ల మేరకు నష్టం మూటకట్టుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News