Monday, September 15, 2025

పంజ్ తరణి నుంచి మళ్లీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : వాతావరణం అనుకూలించక మూడు రోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. జమ్ము కశ్మీర్ లోని పంజ్ తర్ణి, శేష్‌నాగ్ క్యాంపుల నుంచి యాత్రికులు బయలుదేరారు. అమర్‌నాథ్ గుహక్షేత్రం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులను అనుమతించారు. ఇప్పటికే దర్శనం చేసుకున్న భక్తులను బల్తాల్ బేస్ క్యాంపునకు చేరుకోడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు అనంతనాగ్‌లో సైన్యం తమ క్వాజిగుండ బేస్ క్యాంప్‌లో 700 మంది యాత్రికులకు అవకాశం కల్పించింది. మరోవైపు జమ్ము కశ్మీర్ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో జమ్ము నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. ముఖ్యంగా రామ్‌బన్ జిల్లాలో దాదాపు 40 అడుగుల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో 3500 వాహనాలు చిక్కుకుపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News