Saturday, May 18, 2024

సూడాన్ లో ఆధిపత్య పోరుతో ఆగని విధ్వంసం… 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సూడాన్ లో ఆధిపత్య పోరుతో ఆగని విధ్వంసం:
యుఎన్ చీఫ్ గుటెర్రస్ ఆందోళన
శనివారం వైమానిక దాడిలో 22 మంది పౌరుల మృతి

కైరో : సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళాలకు చెందిన ఆధిపత్య పోరు చివరకు అంతర్యుద్ధం అంచుకు చేరి దేశాన్ని అస్థిర పరుస్తోందని ఐక్యరాజ్యసమితి అధినేత గుటెర్రస్ ఆందోళన వెలిబుచ్చారు. రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం కూడా పోరు సాగుతుండడంపై ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇద్దరు అధిపతులను హెచ్చరించారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు సూడాన్‌ను గందరగోళం లోకి నెట్టింది. రాజధాని ఖార్టూమ్‌తో సహా దేశం లోని మిగతా అర్బన్ ప్రాంతాలన్నీ యుద్ధ భూములుగా మారుతున్నాయి. రాజధాని దక్షిణ ప్రాంతంలో ఆదివారం భీకర పోరాటం సాగిందని ఖార్టూమ్ నివాసులు భయాందోళనలు వెలిబుచ్చారు. కలకా వంటి పొరుగునున్న ప్రాంతాల్లో భారీ ఆయుధాలతో యుద్ధం సాగింది. మిలిటరీ విమానాలు గగన తలంలో విహరించాయి. ఈ సందర్భంగా గుటెర్రస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఖార్టూమ్ సమీప నగరం ఆమ్‌డర్‌మ్యాన్‌పై శనివారం జరిగిన వైమానిక దాడిలో 22 మంది పౌరులు మృతి చెందడాన్ని గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఇది మానవతావాదం, మానవతా హక్కుల పట్ల పూర్తిగా నిర్లక్షం వహించడమేనని, ఇది అత్యంత ప్రమాదకరం, ఆందోళనకరంగా ఆయన పేర్కొన్నారు. గుటెర్రస్ తరఫున అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News