Thursday, May 29, 2025

పెద్ద అంబర్ పేటలో కారు, రెండు బైక్ లను ఢీకొట్టిన మరో కారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లోని ఔటర్ రింగురోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డివైడర్ పై నుండి వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్క కారు, 2 రెండు బైకులన ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News