- Advertisement -
పెద్ద అంబర్ పేట: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లోని ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని టాటా కర్వీ కారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు ధగ్ధమయ్యాయి. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరొక వ్యక్తిని స్థానికులు కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -