Friday, April 19, 2024

అరెస్టు చేసిన ఏడుగురు భారతీయులను వెనక్కు పంపనున్న అమెరికా

- Advertisement -
- Advertisement -

America to deport seven arrested Indians

న్యూయార్క్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అమెరికా/కెనడా సరిహద్దుల్లో గత వారం అరెస్టయిన ఏడుగురు భారత జాతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ నుంచి విడుదలైన తర్వాత భారత్‌కు పంపించివేయనున్నారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఆ ఏడుగురు భారత జాతీయులను వారి సదేశానికి పంపించివేస్తామని ఒక ప్రకటనలో అమెరికా బార్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. ఏడుగురు భారత జాతీయులను ఆరుగురు ఇప్పటికీ తమ అదుపులో ఉన్నారని, ఒకరిని మాత్రం మానవతా దృక్పథంతో విడుదల చేశామని తెలిపింది. బార్డర్ పెట్రోల్ కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వీరందరినీ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు. గుజరాత్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఈ ఏడుగురు భారత జాతీయులను గత వారం అమెరికా అధికారులు అమెరికా/కెనడా సరిహద్దుల్లో అరెస్టు చేశారు. ఈ మానవ అక్రమ రవాణాకు పాల్పడిన స్టీవ్ షాండ్ అనే 47 ఏళ్ల వ్యక్తిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News