Wednesday, May 29, 2024

భారత్ కు అమెరికా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇరాన్ తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఈ డీల్ గురించి ప్రస్తావించారు. ‘‘ఇరాన్ తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా ఆంక్షలు ఎదుర్కోక తప్పదు’’ అని వేదాంత్ స్పష్టం చేశారు.

మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం నెరపడానికి చాబహార్ పోర్టు భారత్ కు ప్రధాన మార్గంగా ఉంది. ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టర్మినల్ నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్ సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News