Tuesday, October 15, 2024

ఆర్టికల్ 370 రద్దుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 మీద హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.  దానిని పునరుద్ధరించడం ఎన్నటికీ జరగదన్నారు. జమ్మూకశ్మీర్ బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

2019లో ఆర్టికల్ 370 రద్దయ్యాక శాంతి స్థాపనకు మార్గం సుగమం అయ్యిందన్నారు.  కశ్మీర్ లో ఉగ్రవాదానికి, వెనుకబాటు తనానికి కారణమే 370 ఆర్టికల్ అని, దానిని ఎట్టి పరిస్థితిలో పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. ఆర్టికల్ 370 ఒక చరిత్రనే ఇక అన్నారు.  కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవేనన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలలో జరుగనున్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News