Monday, December 2, 2024

అమిత్ షా హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల తనిఖీలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఈ నెల 20న శాసనసభ ఎన్నికలు జరగనుండగా శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారులు తనిఖీ చేశారు. అమిత్ షా శుక్రవారం హింగోలీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లారు. హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన ఎన్నికల అధికారులు అమిత్ షా ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌లో నిశితంగా సోదా చేశారు. హెలికాప్టర్‌లో ఉన్న బ్యాగులు, సూట్‌కేసులు, ఇతర సరంజామాను వారు సోదా చేశారు.

ఇసి నియమావళిని అనుసరించి ఈ తనిఖీ కార్యక్రమం అంతటినీ వీడియో తీశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా వెల్లడించారు. ఆరోగ్యకర వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగాలని బిజెపి కోరుకుంటుందని, ఎన్నికల కమిషన్ నియమావళిపై తమకు గౌరవం ఉందని అమిత్ షా తెలియజేశారు. భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిపేందుకు ఎన్నికల వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర మంత్రి పిలుపు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News