అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (అమ్మ) అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్ (Shweta Menon)ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో తనపై పోటీ చేసిన దేవన్‌పై ఆమె గెలిచారు. ‘అమ్మ’ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి నటిగా శ్వేతామీనన్ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షురాలిగా, కుక్కు పరమేశ్వరన్ సంయుక్త కార్యదర్శిగా, అన్సిబా హాసన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 506 మంది సభ్యుల్లో 298 మంది ఓటేశారు. ఇక పలువురు నటులు, దర్శకులపై నటీమణులు చేసిన లైంగిక ఆరోపణల (Sexual allegations) నేపథ్యంలో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్‌లాల్ గత ఏడాది రాజీనామా చేశారు. దీంతో 2027లో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను ముందుగానే నిర్వహించారు. అయితే కొన్ని రోజుల క్రితం శ్వేతామీనన్‌పై ఓ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించడం విశేషం.
‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -