రూ.63కు పెరిగిన లీటరు పాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అమూల్ సంస్థ పాల విక్రయ ధరలు మరోసారి పెంచింది. ఫుల్ క్రీమ్ పాల విక్రయాలకు సంబంధించి గేద పాలకు లీటరు రూ.2పెంచుతున్నట్లు వెల్లడించింది. గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండి ఆర్‌ఎస్ సోధి ప్రకటించారు. తాజా పెంపుదలతో ఫుల్‌క్రీం పాలు లీటరు ధర రూ.61నుండి రూ.63కు చేరింది. ఈ ఏడాదిలో అమూల్ పాల ధరలను పెంచటం వరుసగా ఇది మూడవసారి కావటం గమనార్హం. ఆమూల్ సంస్థ మార్చిలో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచింది.ఆగస్టులో అన్ని రకాల పాలపైన మళ్లీ లీటరుకు రూ.2 పెంచింది. పాల సేకరణలో పశుగ్రాసాలు దాణ ధరలు పెరగటం, పాల రావాణా ఖర్చలు పెరగటం, పాల ప్యాకేజింగ్ ఖర్చులు పెరగటం వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని ఎండి సోథి తెలిపారు.