Friday, May 3, 2024

ఉరితీసే విధానం పరిశీలనకు నిపుణుల కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ప్రబలమైన విధానాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్టు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలియజేసింది. కేంద్రం తరఫున హాజరైన అటార్జీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీం కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చర్చల్లో ఉందని, ప్రతిపాదించిన ప్యానెల్ లోని నియమించనున్న వారి పేర్లు ఖరారు ప్రక్రియ తుది దశలో ఉందని, కొంత వ్యవధి తరువాత దీనిపై స్పందిస్తామని చెప్పారు. దీనికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్ తెలియజేసిన వివరాలను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించిందని, దీనిపై తదుపరి విచారణ తేదీని వేసవి శెలవుల తరువాత ప్రకటిస్తామని వెల్లడించింది.

మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఉరితీయడం అనే పద్ధతికి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఉరిశిక్ష అమలుకు మానవీయ కోణంలో మరేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయనే అంశాలను పరిశీలించేందుకు మరింత సమాచారం అవసరమని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News