Saturday, April 13, 2024

వాలంటీరు లైంగిక వేధింపులు… బాలిక ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్ లైంగికంగా వేధించడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామానికి పిట్టు శ్రీకాంత్ రెడ్డి(25) అనే వ్యక్తి వాలంటీరుగా సేవలందిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన విద్యార్థినికి పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటిలో సీటు వచ్చింది. ఆమె రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు విద్యాదీవెన, తదిరత పథకాల కోసం ఒటిపి చెప్పాలని విద్యార్థినికి శ్రీకాంత్ రెడ్డి ఫోన్ చేశాడు. తనని ప్రేమించాలని పలుమార్లు శ్రీకాంత్ రెడ్డి ఫోన్ చేయడంతో ఆమె అతడిని నంబర్‌ను బ్లాక్ చేసింది. వేర్వేరు నంబర్లను ఫోన్ చేసేవాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఆమె చెల్లెలు ఉండడంతో పలుమార్లు లైంగికంగా వేధించాడు.

‘మీ అక్కను తీసుకొని రా లేకపోతే నువ్వు రా అంటూ’ ఆమె చెల్లెలును పలుమార్లు వేధించాడు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు బాలిక చెప్పడంతో అతడిని నిలదీశారు. మళ్లీ బాలిక వెంటపడడంతో వేధింపులు తట్టుకోలేక ఆమె ఎలుకల మందు తాగి పాఠశాలకు వెళ్లింది. వాంతులు చేసుకొని కిందపడిపోవడంతో వెంటనే ఆమెను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. వాలంటీరుపై నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలని స్థానిక నేతలు వాళ్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు మేనమామ మీడియాతో వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News