- Advertisement -
అమరావతి: ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకుందని అన్నారు. ఏడాది పాలన విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోనే పేదల సేవలో, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, మెగా డిఎస్పితో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ఉపాధి కల్పనకు అడుగులు వేశామని చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -