Wednesday, September 3, 2025

హీరో రాజ్ తరుణ్ పై మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణ లు చేసిన లావణ్య మరోసారి తెరపైకి వచ్చింది. కోకాపేటలోని విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. మూడు వేర్వేరు సందర్భాలలో తనను దూషిస్తూ దాడి చేశారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. 2016లో హీరో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో విల్లా కొనుగోలు చేశానని, వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చి నెలలో రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేశాడని లావణ్య వెల్లడించింది. విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ మనుషులు తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆమె తెలిపింది. ఇంటికి సంబంధిం చిన కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉండగా బెల్టులు, గాజు సీసాలతో కొట్టి, ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని లావణ్య పేర్కొంది. తన పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కూడా కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News