Thursday, September 19, 2024

నటుడు రాజ్ తరుణ్ నిందితుడేనా?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో తాజాగా పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. అభియోగ పత్రం ఫైల్ చేసిన పోలీసులు రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చారు.

లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు- ఆమెతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేయడం నిజమేనని తేల్చారు. వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారని తమ ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు. అంతేకాకుండా లావణ్య చెప్పిన దాంట్లో వాస్తవాలున్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఇదిలావుండగా రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు.  అరెస్టు కాకుండా జాగ్రత్త పడ్డాడు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News