Monday, April 29, 2024

అడ్వెంట్ ఆగయా

- Advertisement -
- Advertisement -

రూ. 16,650 కోట్ల భారీ పెట్టుబడి 
సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలందిస్తాం…

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూలో ఉండగా, మరో దిగ్గజ సంస్థ కూడా ముందుకు వచ్చింది. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు కంపెనీ ఎండి పంకజ్ పట్వారీ, ఆపరేటింగ్ పార్ట్నర్ వైదీష్ అన్నస్వామి హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో శుక్రవారం సమావేశ మయ్యారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగ ప్పన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కెటిఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ జాన్ మల్డొ నాడొతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా ఈకో సిస్టం గురించి విస్తృతంగా చర్చించిన అంశాన్ని ఈ సమావేశంలో పంకజ్ పట్వారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కెటిఆర్‌కు పంకజ్ పట్వారి వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.16,650 కోట్లు భారీ పెట్టుబడులు నగరంలో పెట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ భారీ పెట్టుబడి కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో లైఫ్ సైన్సెస్ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొనవచ్చు. ఈ పెట్టుబడి ద్వారా తమ సంస్థ ఎపిఐ, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడు తుందని సదరు సంస్థ వెల్లడించింది. తమ పెట్టుబడితో పాటు జినోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ అండ్ డెవల ప్‌మెంట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలిపింది. అడ్వెంట్ ఇంటర్నెషనల్ సంస్థ హైదరాబాద్ సువెన్ ఫార్మా సుటికల్ కంపెనీలో దాదాపు రూ.9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీంతో పాటు తన ’కోహన్స్ ప్లాట్‌ఫారం’ ద్వారా మరిన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. తన ఆర్‌ఎ కెమ్ ఫార్మా, జెడ్‌సిఎల్ కెమికల్స్, అవ్రా లాబరేటరీ వంటి సంస్థలకు హైదరాబాద్ తన కేంద్ర స్థానంగా ఎంచు కొనుంది.

నగరంలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ తన పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించుకోవడం పట్ల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.. తెలంగాణలో నూతన పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున విస్తరిస్తుండడం తెలం గాణ ఐటీ, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం బలానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ బలోపేతం చేసేం దుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల కార్యక్రమా లను చేపట్టామని, ముఖ్యంగా పరిశ్రమ భాగస్వాముల తో కలిసి చేపట్టిన అనేక కార్యక్రమాలు ఈరోజు లైఫ్ సైన్సెస్ ఈకోసిస్ట్ వేగంగా వృద్ధి అయ్యేలా చేస్తున్నాయన్నాయని తెలిపారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ కేంద్రంగా మరింత పెద్ద ఎత్తున వృద్ధి సాధిస్తుందని, ఇందుకోసం సంస్ధకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అంది స్తామని మంత్రి వెల్లడించారు. ‘తెలంగాణలో అడ్వెంట్ వర్ధిల్లు తుందని నేను విశ్వసిస్తున్నాను. మేము మా పరిశ్రమ భాగస్వా ములకు వారి వృద్ధి ప్రయత్నాల్లో తిరుగులేని మద్దతును అందిస్తూనే ఉంటాం. నగరంలో ఉన్న వినూత్న ఆవిష్కరణలు, వృద్ధి అవకాశాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసు కున్నా’మని అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఎండి పంకజ్ పట్వారీ అన్నారు.

KTR 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News